కరోనా ఉద్ధృతి నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా యంత్రాంగంతో శనివారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. కరోనాను ఎదుర్కొనేందుకు నాలుగు విధాల కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. వైరస్ వ్యాప్తిని కట్టడికి ప్రజల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు... టీకా పంపిణీలో వేగం పెంచటం వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని, పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు పెంచాలని ఆదేశించినట్లు తెలిపారు. నిజామాబాద్ నగరంలో 11, బోధన్‌లో ఏడు, ఆర్మూర్‌లో ఒకటి చొప్పున జిల్లాలో 19 ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు అనుమతించామని చెప్పారు.