లాక్డౌన్, ఇతర కారణాలతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో కరోనా కట్టడి, లాక్ డౌన్, ఆస్పత్రుల్లో వైద్య సేవలపై వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
'లాక్డౌన్, ఫీవర్ సర్వే ద్వారా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి' - కరోనా కేసులపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష
రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ సత్ఫలితాలనిస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫీవర్ సర్వే ద్వారా కొవిడ్ కేసులను కట్టడి చేయగలుగుతున్నామని చెప్పారు. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
లాక్డౌన్ సత్ఫలితాలిస్తోందని 10 రోజుల్లో 10శాతం పాజిటివ్ కేసులు తగ్గాయని మంత్రి చెప్పారు. లాక్‌డౌన్‌కు ముందు నిర్వహించిన ఫీవర్ సర్వే వల్ల లక్షణాలున్న వారికి మందులివ్వడంతో కట్టడి చేయగలుగుతున్నామని చెప్పారు. మరో 10 రోజుల్లో పాజిటివ్ రహిత జిల్లాగా నిజామాబాద్‌ను మార్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గిపోయిందని.. ఆక్సిజన్, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. బ్లాక్ ఫంగస్ కోసం మందులు తెప్పిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి:స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం.. పొగాకు వ్యతిరేక ఉద్యమం