దిల్లీకి వెళ్లిన వారిలో నిజామాబాద్ జిల్లా నుంచి 53 మంది ఉన్నారని.. కాగా వారిలో 43 మంది పట్టణ వాసులే అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నలుగురిని అనుమానితులుగా గుర్తించి హైదరాబాద్‌కు తరలించామని.. వారి రిపోర్ట్లు ఇంకా రాలేదని మంత్రి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో కరోనాపై చేపడుతున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అధికారులతో ఆయన సమీక్షించారు.
నిజామాబాద్ నుంచి 53 మంది దిల్లీకి వెళ్లారు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి - కరోనా పరీక్షలు
హజ్రత్ నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లిన వారిలో నిజామాబాద్ నుంచి 53 మంది ఉన్నారని ఉన్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించామని.. వారిలో 14 మందికి రిపోర్టులు రావాల్సి ఉండగా.. ఒకరికి మాత్రమే పాజిట్వ్ వచ్చిందని ఆయన వెల్లడించారు.
నిజామాబాద్ నుంచి 53 మంది దిల్లీకి వెళ్లారు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
జిల్లా నుంచి వ్యాధి లక్షణాలున్నాయనే అనుమానంతో 29 మందిని హైదరాబాద్‌కు పంపామని.. 14 మంది రిపోర్టు రావాల్సి ఉండగా.. మిగతా అందరికీ నెగటివ్ వచ్చిందన్నారు. ఒకరికి మాత్రమే పాజిటివ్ కేసు నమోదైందని చెప్పారు. జిల్లాలో 11వేల మంది వలస కార్మికులు ఉండగా.. వారికి బియ్యం, నగదు పంపిణీ చేస్తున్నామని రెండు రోజుల్లో పూర్తి చేస్తామని చెబుతున్నారు.
ఇదీ చూడండి:ఇవాళ ఒక్కరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు