తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలో శ్రీరాం​సాగర్​లోకి కాళేశ్వరం నీళ్లు: ప్రశాంత్​ రెడ్డి

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు వానా కాలానికి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్​లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మంత్రి అధ్యక్షతన జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశం నిర్వహించారు.

ప్రశాంత్​ రెడ్డి, నిజామాబాద్​
prashanth reddy, minister

By

Published : Jul 6, 2021, 8:35 PM IST

నిజామాబాద్ కలెక్టరేట్​లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డి అధ్యక్షతన జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ రూలర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు, కలెక్టర్ నారాయణరెడ్డి, నీటిపారుదల, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల ఆయకట్టుకు నీరు అందించడానికి అధికారులకు పలు సూచనలు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు వానా కాలానికి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జులై మొదటి వారంలోనే నీటి విడుదల చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నిజాంసాగర్​కు 1.5 టీఎంసీల నీటిని మండు వేసవిలో తరలించినట్లు తెలిపారు. శ్రీరాం​సాగర్ పునరుజ్జీవన పథకం పూర్తయిందని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీళ్లు తరలించడానికి సంసిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి రైతు నీటిని పొదుపుగా వాడుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల నుంచి ఈనెల 11 నుంచి నీటి సరఫరా చేసేందుకు సిద్ధం ఉండాలని ఉండాలని అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ రైతులకు భరోసా వచ్చింది. జులై 10 నుంచి నీటిని వదులుతాం. జులైలో నీటి విడుదల చరిత్రలో మొదటిసారి. -ప్రశాంత్​ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి

త్వరలో శ్రీరామ్​సాగర్​లోకి కాళేశ్వరం నీళ్లు: ప్రశాంత్​ రెడ్డి

ఇదీ చదవండి:KTR: రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలి

ABOUT THE AUTHOR

...view details