మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. మొదటగా ముప్కాల్ మండలంలోని బస్సపూర్ వద్ద గల ఎస్సారెస్పీ జీరో పాయింట్‌కి చేరుకొని పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
'మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం' - బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు.
Minister prashanth reddy
బోటింగ్ పాయింట్ ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అధికారులతో చర్చించారు. రోప్ వే ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. బాల్కొండ మండలంలోని నాగపూర్ వద్దగల శ్రీరాంసాగర్ జలాశయ తీరానికి చేరుకుని అక్కడ రొయ్య పిల్లలను జలాశయంలోకి వదిలారు. కార్యక్రమంలో నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు పాల్గొన్నారు.