తెరాస తరఫున పోటీ చేసే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల తెరాస కార్యకర్తల సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు సమష్టిగా పని చేసి తెరాస అభ్యర్థులు గెలుపుకు కృషి చేయాలని మంత్రి కోరారు. గ్రామాల్లో వంద శాతం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గులాబీ పార్టీ అభ్యర్థులే గెలువాలని ఆకాక్షించారు. గ్రామస్థాయి నుంచి తెరాస ప్రజా ప్రతినిధులు ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పలువురు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
తెరాస అభ్యర్థులను గెలిపించుకోవాలి: ప్రశాంత్‌రెడ్డి - మంత్రి ప్రశాంత్‌రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో పలు సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.
తెరాస అభ్యర్థులను గెలిపించుకోవాలి