తెలంగాణ

telangana

ETV Bharat / state

'హరితహారంలో నాటిన ప్రతిమొక్కనూ బతికించాలి'

హరితహారం, పట్టణప్రగతి, వీధి వ్యాపారులకు రుణాలపై అధికారులతో మంత్రి కేటీఆర్​ దృశ్యమాధ్యమ సమీక్షను నిర్వహించారు. జూన్​ 20న ప్రారంభంకానున్న హరితహారంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని.. నాటిన మొక్కలను రక్షించాలని మంత్రి కేటీఆర్​ కోరారు.

minister ktr video conference with municipal officers
మున్సిపల్​ అధికారులతో మంత్రి కేటీఆర్​ వీడియో కాన్ఫరెన్స్

By

Published : Jun 13, 2020, 8:30 PM IST

హరితహారం, పట్టణప్రగతి, వీధి వ్యాపారులకు రుణాలపై మేయర్లు, మున్సిపల్​ ఛైర్మన్లు, అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో నిజామాబాద్​ నగర మేయర్​ నీతూకిరణ్​తో పాటు కమిషనర్​ జితేష్​ పాల్గొన్నారు. జూన్​ 20 నుంచి ప్రారంభంకానున్న హరితహారం కార్యక్రమంలో మున్సిపల్​ అధికారులు, ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని రాష్ట్ర మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ సూచించారు.

హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యతను మున్సిపల్ ఛైర్మన్, మేయర్, కమిషనర్​ తీసుకోవాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి తప్పనిసరిగా ఓ నర్సరీ ఉండాలని దృశ్యమాధ్యమ సమీక్షలో మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details