వైద్య సిబ్బందిపై దాడులను సహించేది లేదు: కేటీఆర్ - Minister KTR condemn on attacks on Doctors at Gandhi Hospital
గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై జరిగిన దాడిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని క్షమించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

Minister KTR condemn on attacks on Doctors at Gandhi Hospital
గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి... నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకోవడాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఈ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రి తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో వైద్య సేవలందిస్తోన్న సిబ్బందిపై దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని క్షమించేది లేదని.. వారు సమాజానికి భారమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
TAGGED:
Minister KTR latest news