నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును... అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టు పూర్తిగా నిండినందున... సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి తెలిపారు. రెండు పంటలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌ఫ్లో చూస్తుంటే నెల రోజుల వరకు పూర్తి స్థాయిలో నిండుగా ఉంటుందన్నారు.
శ్రీరాంసాగర్ జలాశయాన్ని సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిశీలన
నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండినందున... సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు జలాశయాన్ని సందర్శించారు.
శ్రీరాంసాగర్ జలాశయాన్ని సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కాళేశ్వరం నుంచి నీరు తీసుకునే అవసరం లేకుండానే వరుణుడి దయ వల్ల రెండేళ్లుగా... జలాశయం పూర్తిగా నిండుతోందని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకొని రెండో పంటకు సమాయత్తం కావాలని సూచించారు. ప్రాజెక్టు ఈఈ రామారావు, డీఈఈ జగదీశ్... మంత్రికి ప్రాజెక్టు విశేషాలు తెలియజేశారు.
ఇదీ చూడండి:గోదారమ్మకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు
TAGGED:
indrakaran reddy visit srsp