వెనుకబడిన కులాలన్నింటినీ అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయంలో 34 బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. బీసీల వద్దకే వెళ్లి వారికి కావలసిన వాటినే చట్టాలుగా చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని మంత్రి గంగుల తెలిపారు. గత డెబ్బై ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారినా వెనుకబడిన వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్న మంత్రి.. తెరాస ప్రభుత్వం వచ్చాక 261 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని వివరించారు.
వెనుకబడిన కులాల అభివృద్ధే సీఎం లక్ష్యం: గంగుల - mlc kavitha news
నిజామాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో 34 బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. వెనుకబడిన కులాల అభివృద్ధే సీఎం లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీసీలకు సంక్షేమ ఫలాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కవిత స్పష్టం చేశారు.
మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కవిత
బీసీలకు సంక్షేమ ఫలాలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్‌లో డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని బీసీలకు సైతం వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కవిత విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:బీసీలు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదు: ఆర్.కృష్ణయ్య