మెప్మా ఆర్పీలకు రావాల్సిన వేతనాలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని అరుణోదయ రిసోర్స్ పర్సన్స్ సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్పీలకు 2019 జులై నుంచి, ఒక సంవత్సరం పాటు వేతనాలు చెల్లించాల్సి ఉన్నా.. ఇంతవరకు చెల్లించలేదని రిసోర్స్ పర్సన్స్ సొసైటీ నాయకురాలు విజయ అన్నారు.
'మెప్మా ఆర్పీలకు వెంటనే వేతనాలను విడుదల చేయాలి' - nizamabad district news
నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట అరుణోదయ రిసోర్స్ పర్సన్స్ సొసైటీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మెప్మా ఆర్పీలకు రావాల్సిన వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

'మెప్మా ఆర్పీలకు వేతనాలను వెంటనే విడుదల చేయాలి'
వేతనాలు లేకపోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కరోనా వైరస్ ప్రభావంతో వేతనాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఈ ఏడాది ఇళ్లలోనే గణేష్ పండుగను జరుపుకోవాలి: తలసాని