లాక్డౌన్ కారణంగా మీ సేవ నిర్వాహకులను ఆర్థికంగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రూ.12 వేల రుణం మంజూరు చేసింది.
కేసీఆర్ చిత్రపటానికి మీ సేవ నిర్వాహకుల పాలాభిషేకం - meeseva organizers thanked cm kcr
కరోనా కష్టకాలంలో తమను ఆర్థికంగా ఆదుకుంటోన్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మీ సేవ నిర్వాహకులు అభినందనలు తెలిపారు. వడ్డీలేని రూ.12వేల రుణాన్ని మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్కు మీ సేవ నిర్వాహకుల పాలాభిషేకం
కష్టకాలంలో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మీ సేవ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేం చేశారు.