నిజామాబాద్ నగరంలోని 11వ డివిజన్ పరిధిలోని హసన్‌బాద్ నగర్, దొడ్డి కొమరయ్య కాలనీ, భారత్ రాణి కాలనీల్లో నగర మేయర్ దండు నీతూ కిరణ్ పర్యటించారు. హరితహారం మొక్కలను ప్రతి ఇంటి ముందు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని నగరవాసులకు మేయర్ సూచించారు.
అందరి భాగస్వామ్యంతోనే హరితహారం విజయవంతం: మేయర్ - nizamabad mayor
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ మొక్కలు నాటాలని నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ సూచించారు. నగరంలోని పలు కాలనీల్లో ఆమె పర్యటించారు.
కాలనీవాసులు పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని ఆమె తెలిపారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. ప్రజలు కూడా వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ నీతూ కిరణ్ తెలిపారు.
ఇవీ చూడండి:కోటి విత్తన బంతులతో గిన్నిస్ రికార్టు సాధిస్తాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్