నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్ సందర్శించారు. తమ కుటుంబసభ్యులతో కలిసి డ్యామ్‌పై కలియ తిరుగుతూ ప్రాజెక్టు అందాలను తిలకించారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోగా.. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోందన్నారు.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మేయర్ నీతూకిరణ్ - nizamabad mayor visited srsp project
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కుటుంబసభ్యులతో కలిసి మేయర్ నీతూకిరణ్ సందర్శించారు. అనంతరం జలాశయం దిగువన ఉన్న పవర్‌హౌస్‌ను పరిశీలించారు.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మేయర్ నీతూకిరణ్
ఆ తర్వాత అధికారులు.. ప్రాజెక్టు వివరాలను మేయర్‌కు తెలియజేశారు. అనంతరం శ్రీరాం సాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న పవర్‌హౌస్‌ను సందర్శించారు. ఎడతెరిపి లేని వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో తెలంగాణ వరప్రదాయని ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండిపోయి.. దిగువ ప్రాంతాలకు పొంగిపొర్లుతోందని మేయర్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: దేశానికి మేజర్ ధ్యాన్‌చంద్ సేవలు చిరస్మరణీయం