నిజామాబాద్ నగరంలోని బహుజన కాలనీలో నల్ల పోచమ్మ అమ్మవారికి ఆదివారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన బోనాల పండుగలో మేయర్ దండు నీతూ కిరణ్ బోనమెత్తారు. బోనం సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారికి బోనం ఎత్తిన ఆ నగర మేయర్ - latest news of nizamabad
నిజామాబాద్‌లోని బహుజన కాలనీల్లో నల్లపోచమ్మ అమ్మవారికి నిర్వహించిన బోనాల పండుగలో మేయర్ నీతూకిరణ్ బోనం ఎత్తుకున్నారు. కరోనా మహమ్మరి నియంత్రణలోకి రావాలని అమ్మవారికి బోనం సమర్పించి వేడుకున్నారు.
అమ్మవారికి బోనం ఎత్తిన ఆ నగర మేయర్
కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా బోనాల పండుగ జరుపుకోవాల్సి వస్తోందన్నారు. అమ్మవారి దయతో కరోనా మహమ్మారి నియంత్రణలోకి రావాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు