తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి - అదనపు కట్నం కోసమే చంపేశారు

20 ఏళ్లు కూడా దాటని వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను అదనపు కట్నం కోసమే చంపేసారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ముల్లంగిలో చోటుచేసుకుంది.

Married women death in suspicious condition at mullangi nizamabad
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

By

Published : Jun 22, 2020, 6:40 PM IST

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ముల్లంగిలో అనుమానాస్పద స్థితిలో అస్మాబేగం(20) అనే వివాహిత మృతి చెందింది. ఆమెకు ఎనిమిది నెలల క్రితం వివాహమైంది. భర్త వ్యవసాయ పనులు చేస్తాడు.

కొన్ని రోజుల నుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారే అస్మా బేగంను వేధిస్తున్నారని తెలిసింది. ఆమెను పథకం ప్రకారమే ఉరేసి చంపారని మృతిరాలి కుటుంబీకులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :ఆ మిర్చియార్డులో కమీషన్​ ఏజెంట్​కు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details