నిజామాబాద్ జిల్లా హొన్నాజీపేట్లో బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందిన వివాహిత అంతిమ సంస్కరణలను పోలీసులు నాటకీయ పరిణామంలో జరిపించారు. ఓ వైపు న్యాయం జరగాలంటూ మహిళ సంఘాలు ఆందోళన నిర్వహిస్తూండగానే.... శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం పోలీసులు శవాన్ని నేరుగా శ్మశానానికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
నిందితుడు పరారీలో ఉన్నాడని... రెండు రోజుల్లో పట్టుకొస్తామని స్థానికులను బుజ్జగించి పోలీసులు చివరికి మృతదేహానికి అంతిమ సంస్కరణలు జరిపించారు.
ఇచ్చిన మాట నిలబేట్టుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని మహిళా సంఘాలు హెచ్చరించాయి.