తెలంగాణ

telangana

ETV Bharat / state

పేరు- ట, తండ్రి- డ; పేరు- స, భర్త- ర - NIZAMABAD

ఓటర్ల జాబితాల్లో విచిత్రాలు చోటు చేసుకోవటం కొత్తేమీ కాదు. కానీ... ముసాయిదాలో కాకుండా తుది జాబితాలోనూ... రకరకాల తప్పులు దొర్లటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఒక్కో అక్షరంతోనే పేర్లు, తండ్రి పేర్లు... ఇంకొన్ని సార్లు అన్నింటి దగ్గరా ఊరిపేరే దర్శనమివ్వటం ఓటర్లను విస్మయానికి గురిచేస్తోంది.

MANY BLUNDER MISTAKES IN VOTER LIST

By

Published : Jul 19, 2019, 9:58 AM IST

Updated : Jul 19, 2019, 12:01 PM IST

అధికారుల నిర్లక్ష్యానికి అద్దం

పేరు- ట, తండ్రి- డ, పేరు- స, భర్త- ర.... ఇవేవో తెలుగు వ్యాకరణంలోని పదాలు కాదండోయ్​... నిజామాబాద్​ జిల్లా బోధన్ పట్టణ ఓటర్ల తుది జాబితాలోని పేర్లు. ముసాయిదా విడుదల చేసిన అనంతరం తప్పులు సరిచేయాల్సిన అధికారుల పనితీరుకు అక్షర రూపం. ఇలా ఒకటో రెండో అయితే పొరపాటు జరిగిందనుకోవచ్చు... కానీ... ఇలాంటివి కోకొల్లలు కనిపిస్తున్నాయి ఈ జాబితాలో. పేరు సరిగా ఉంటే తండ్రి పేరు ఒక్క అక్షరం... అసలు పేర్లే లేకుండా కొందరి ఫోటోలు... ఆధార్​ కార్టులున్న ఫోటోలతో పేర్లు... సామాజిక వర్గాల మార్పులు ఇలా ఒకటేమిటీ చూస్తూంటే మొత్తం తప్పుల తడకే.

ఇప్పటికే జాబితాపై నెలకొన్న గందరగోళంతో నాయకులు గగ్గోలు పెడుతున్నా అధికారులు నిర్లక్ష్యం వీడట్లేదు. ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చటం, తొలగించటం తమ పని కాదని కమిషనర్ స్పష్టం చేస్తున్నారు. ఓటర్ల ఫోటోలకు బదులు వారి ఆధార్ కార్డులు, పదో తరగతి మెమోలు ఉన్నా... సరిదిద్దకుండా వాటి పక్కన సామాజిక వర్గాన్ని తెలియజేయటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికారులు ముసాయిదా విడుదల చేసే ముందు తప్పులను సరి చూసుకోవాలని నాయకులు, ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఈఎస్​ఐలో అక్రమాలను నిగ్గుతేల్చే పనిలో అనిశా

Last Updated : Jul 19, 2019, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details