తెలంగాణ

telangana

ETV Bharat / state

'చేతివాటం చూపిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై కఠిన చర్యలు' - 'చేతివాటం చూపిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై కఠిన చర్యలు'

భూప్రక్షాళనలో చేతివాటం చూపిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై కఠిన చర్యలుంటాయని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్​రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయిలో నిర్వహించి మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.

MANDAL LEVEL MEETING IN INDHALVAI

By

Published : Oct 23, 2019, 11:29 PM IST

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో కిందిస్థాయి ఉద్యోగుల చేతివాటం వల్ల అనేక లోపాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ వి.గంగాధర్​గౌడ్​తో కలిసి హాజరయ్యారు. రెవెన్యూ శాఖపై సమీక్షించిన ఎమ్మెల్యే... కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు వివరించారు. సమస్యలపై వెంటనే విచారణ జరిపించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్​కు సూచించారు. నియోజకవర్గంలోనూ అసైన్డ్ భూముల కమిటీ అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములకు అసైన్డ్ చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు.

'చేతివాటం చూపిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై కఠిన చర్యలు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details