నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలానికి వచ్చిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం కేసీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి మానికోల గంగాధర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
'చెప్పులు కుట్టే వాళ్లకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి'
సీఎం కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. చెప్పులు కుట్టే వారిని సీఎం అవమానించేలా మాట్లాడారని ఆరోపించారు.
మందకృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి పదవి తనకు ఎడమ కాలి చెప్పుతో సమానమని కేసీఆర్ మాట్లాడారని ... ఈ విషయంలో చెప్పులు కుట్టే జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాధ్యతాయుత పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:ఆర్టీసీని నేను రెండో పెళ్లి చేసుకున్నా: మంత్రి పువ్వాడ