తెలంగాణ

telangana

ETV Bharat / state

'రియల్ గొడవలతో వ్యక్తి దారుణ హత్య... పీఎస్​లో లొంగుబాటు' - 'రియల్ గొడవలతో వ్యక్తి దారుణ హత్య... పీఎస్​లో లొంగుబాటు'

నిజామాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ గొడవలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు.

ఆస్తి గొడవలతో వ్యక్తి దారుణ హత్య
ఆస్తి గొడవలతో వ్యక్తి దారుణ హత్య

By

Published : Dec 16, 2019, 5:58 PM IST

నిజామాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. భీంగల్ మండలం బాబానగర్ శివారులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కలీం​ను ప్రత్యర్థులు దారుణంగా పొడిచి చంపారు. తానే హత్య చేశానంటూ మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి బలరాం అనే వ్యక్తి భీంగల్ ఠాణాలో లొంగిపోయాడు. భీంగల్ పట్టణంలో ఉన్న దుకాణ సముదాయాలు, వాటి పక్కనే ఉన్న భూముల విషయంలో మృతుడు కలీంకు మరికొందరు రియల్ వ్యాపారుల మధ్య వివాదం నెలకొంది.

'బగ్గుమన్న బాధిత కుటుంబం... న్యాయం కోసం డిమాండ్'

ఈ క్రమంలో ఇవాళ ఉదయం కలీంను మాట్లాడేందుకు పిలిపించారు. అనంతరం కంట్లో కారం చల్లి వేట కొడవలితో నరికి చంపేశారు. నిందితుడు బలరాం భీంగల్ పీఎస్​లో కొడవలితో సహా లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్య చేయడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంఘటనా స్థలంలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఆస్తి గొడవలతో వ్యక్తి దారుణ హత్య

ఇవీ చూడండి : హెచ్​ఎం వేధిస్తున్నాడని ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details