ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు - ఆకట్టుకున్న నృత్యాలు, వేషధారణలు Makara Sankranti Festival 2024 : రాష్ట్రంలోని పలు పాఠశాల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు(Sankranti Festival 2024) ఘనంగా జరిగాయి. చిన్నారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ఈ వేడుకల్లో పాల్గొని, ఆనందించారు. వరంగల్లోని ఓ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన, ముగ్గులు, పతంగుల పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. విద్యార్థినులు ఒకరుకొకరు పోటీపడుతూ రంగవల్లులు వేశారు. పతంగుల ఎగురవేస్తూ సంబరంగా గడిపారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల- కళాశాలలో ముగ్గులు వేసిన విద్యార్థులు, గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేశారు. పిండివంటలు తయారుచేసి వేడుకల్లో ప్రదర్శించారు. ఉత్సవాల్లో పాల్గొన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భోగి(Bhogi) మంటల చుట్టూ నృత్యాలు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారుల గంగిరెద్దుల వేషధారణలు, హరిదాసుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
వరంగల్లోనిఫార్మసీ కళాశాల మహిళా అధ్యాపకులు ముగ్గులు పరిశీలించి విజేతలను నిర్ణయించారు. అద్భుత ప్రతిభ కనబర్చిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు సైతం అందజేశారు. సంప్రదాయాలను మర్చిపోతున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని విద్యార్థినులు అంటున్నారు. రైతులు చేసుకునే ఈ సంక్రాంతి పండుగను అందరూ శ్రద్ధగా చేసుకోవాలని సూచించారు.
ఇందూరు వాసుల సంక్రాంతి స్పెషల్ ఫేవరేట్.. ఈ ఘేవర్ స్వీట్
"సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. ఇప్పుడు ఎవరికీ కూడా సంక్రాంతి అంటే ఏమిటో తెలియదు. రైతులు కొత్త పంటలు పండిస్తారో వాటితో ఈ పండుగను జరుపుకుంటారు. భోగి రోజు భోగి మంటలు వేస్తారు. చిన్న పిల్లలపై భోగి పళ్లను వేస్తారు. సంక్రాంతి రోజు రంగోళి, గొబ్బమ్మ అంటూ ఎంతో సంతోషంగా మహిళలు వేడుకలను చేసుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఎంతో ఘనంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకుంటారు." - విద్యార్థినులు
Makara Sankranti 2024 : నగరంలోని పలు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబురాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్లోని నారాయణ విద్యాసంస్థల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. రంగు రంగు ముగ్గులు, పల్లె వాతావరణం ఉట్టిపడే విధంగా సెట్టింగ్లు ఆకట్టుకున్నాయి. గాలి పతంగులు ఎగరవేస్తూ భోగి మంటల చుట్టూ చిన్నారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు సంక్రాంతి పండగ విశేషాలు తెలియజేశారు. సంక్రాంతి అంటే రైతుల పండగ అని, మూడు రోజుల పాటు రకరకాల పిండి వంటలు, కొత్త దుస్తులు ధరించి బంధువులతో సంతోషంగా జరుపుకుంటారని ఉపాధ్యాయులు తెలిపారు.
మొదలైన సంక్రాంతి సందడి - కీసర టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు
సంక్రాంతి- నాలుగు రోజుల పండగంట! మీకు తెలుసా మరి?