తెలంగాణ

telangana

ETV Bharat / state

భక్తిశ్రద్ధలతో మార్మోగిన ఆలయాలు.. కనుల పండువగా శివయ్య కల్యాణం - telangana news

మహా శివరాత్రి వేడుకల సందర్భంగా నిజామాబాద్‌ జిల్లాలోని పలు ఆలయాలు భక్తిశ్రద్ధలతో మార్మోగాయి. శివయ్య కల్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులు... ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Maha Shivaratri celebrations in Nizamabad district
భక్తిశ్రద్ధలతో మార్మోగిన ఆలయాలు.. కనుల పండువగా శివయ్య కల్యాణం

By

Published : Mar 12, 2021, 5:20 PM IST

మహా శివరాత్రి పురస్కరించుకుని నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, ముప్కాల్‌, మెండోరా మండలాల్లోని శివాలయాలు భక్తిశ్రద్ధలతో మార్మోగాయి. శివయ్య కల్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి... ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముప్కాల్‌లో పడిలేచిన మర్రిచెట్టు వద్ద, పోచంపాడ్‌లోని శ్రీరామలింగేశ్వరస్వామి మందిరం, వెల్గటూర్​లోని రాజరాజేశ్వరస్వామి మందిరం వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు శివాలయాలకు వచ్చి భోజనాలు చేశారు.

ఇదీ చదవండి:ఏపీకి కష్టం వచ్చిందని మేం నోరు మెదపకుండా ఉంటే ఎలా?: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details