నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి తెరాస, భాజపా అభ్యర్థులు ఇద్దరు నామినేషన్ వేశారు కానీ.. వారిద్దరు ఒకే పార్టీకి చెందిన వారని కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ అన్నారు. జిల్లాకేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన హస్తం పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. నిరుపేదల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే చేయి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
'తెరాస ఓడితే మోదీ కూడా ఓడిపోతారు' - కాంగ్రెస్
రాష్ట్రంలో తెరాసను ఓడిస్తే.. కేంద్రంలో మోదీ ఓడిపోతారని నిజామాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్‌కే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
నిజామాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ