దేశాన్ని మోదీ మతపరంగా విభజిస్తున్నారు: మధుయాస్కీ - madhuyaskhi
మోదీ మరోసారి ప్రధాని అయితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్ ఆరోపించారు. దేశాన్ని మతపరంగా విభజిస్తున్నారని విమర్శించారు. మైనార్టీలు, ఎస్సీలు, ముస్లింలపై దాడులు చేసినా... కవిత, సీఎం కేసీఆర్ స్పందించలేదని మండిపడ్డారు. నిజామాబాద్ డీసీసీ కార్యాలయంలో మీడియాతో సమావేశం నిర్వహించారు.
madhu