తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎల్​ఆర్​ఎస్​, ధరణి ఫోర్టల్​ను రద్దు చేయాలి'

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్​ఆర్​ఎస్​, ధరణి ఫోర్టల్​ను రద్దు చేయాలని నిజామాబాద్ సిటీ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నాయకులు డిమాండ్​ చేశారు. ఎల్​ఆర్​ఎస్​ ద్వారా సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

LRS Dharani portal cancel demand in nizamabad district
'ఎల్​ఆర్​ఎస్​, ధరణి ఫోర్టల్​ను రద్దు చేయాలి'

By

Published : Dec 10, 2020, 5:17 AM IST

ఎల్​ఆర్​ఎస్​, ధరణి ఫోర్టల్​ను రద్దు చేయాలని నిజామాబాద్ సిటీ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి, కలెక్టర్​కు వినతిపత్రం అందించారు.

ఎల్​ఆర్​ఎస్​, ధరణి పోర్టల్​ను తొలగించాలని చేయాలని జిల్లా అధ్యక్షులు గండ్ల విజయ్ కోరారు. ఆగిన రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభించాలని తెలిపారు. ఈ విధానం వల్ల ఫ్లాట్​కొనే వారిపై, ఇల్లు కట్టుకునే వారిపై అధిక ఆర్థిక భారం పడుతుందని అన్నారు.

ఎల్​ఆర్​ఎస్​ ద్వారా సామాన్య ప్రజలు పడుతున్న అధిక భారాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. గత ఆరు నెళ్లుగా రిజిస్ట్రేషన్​లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి :'న్యాయం చేయకుంటే.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details