తెలంగాణ

telangana

ETV Bharat / state

'రెండు చేతులు కోల్పోయి... సాయం కోసం ఎదురుచూపులు'

ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో రెండు చేతులు కోల్పోయింది. అత్తింటి వారి నిరాధారణతో పుట్టింటికి చేరుకుంది. ఏమీ చేయలేని నిస్సహాయత. ఇదీ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రెండు చేతులు కోల్పోయిన మీరా బాయి దీనగాధ.

'రెండు చేతులు కోల్పోయి... సాయం కోసం ఎదురుచూపులు'
'రెండు చేతులు కోల్పోయి... సాయం కోసం ఎదురుచూపులు'

By

Published : Sep 3, 2020, 3:20 PM IST

నిజామాబాద్ జిల్లా పాత బోధన్ లో నివాసముండే రతన్ బాయి, శేషా రావు నలుగురు సంతానంలో ఒకరు మీరా. ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు వారి జీవితాలు వారివే. చిన్న కొడుకుతో కలిసి మట్టి గోడల ఇంట్లో కనీసం విద్యుత్ సరఫరా కూడా తీసుకోలేని దయనీయ స్థితిలో గడిపేస్తున్నారు. కుటుంబానికి పోషణ శేషా రావు కట్టెలు కొట్టగా వచ్చిన ఆదాయం, ఆసరా పింఛన్ ఆధారంగా మారింది.

దయనీయ స్థితి..

ఉన్నంతలో సర్దుకుపోతున్న తరుణంలో వారి కూతురు సంక్రాంతి సమయంలో ప్రమాదానికి గురైంది. అత్తింటివారు తీసుకెళ్లకపోవడం వల్ల ఇంటికి తీసుకొచ్చారు. ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉంటున్న ఆమె పోషణ, మందులు వీరే చూసుకుంటున్నారు. దయనీయ స్థితిలో ఉన్న కుటుంబ పరిస్థితిని చూసి కనీసం దివ్యాంగుల కోటా కింద పింఛన్, విద్యుత్ సరఫరా అయినా ఇప్పిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక యువకుడు పోస్టు చేసిన వీడియో అందరిని కదిలించింది.

ABOUT THE AUTHOR

...view details