ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతోంది. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులతో పాటు జిల్లా సరిహద్దులను పూర్తిగా మూసేశారు. నగరాలు, పట్టణాల సరిహద్దులను కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ అనుమతించడం లేదు. అత్యవసరం అయితే తప్ప బయటి వ్యక్తులను అనుమతించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగితే వాహనాలు సీజ్ చేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న లాక్డౌన్ - coronavirus update news
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లాక్డౌన్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులతో పాటు సరిహద్దులను పూర్తిగా మూసేశారు. పట్టణాల సరిహద్దులో బారికేడ్ల ఏర్పాటు చేసి బయటి వ్యక్తులను ఎవరినీ అనుమతించడం లేదు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న లాక్ డౌన్
పట్టణాల్లో రోడ్లపై కాస్త జనం కనిపిస్తున్నా.. పల్లెల్లో మాత్రం ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గ్రామాల సరిహద్దుల్లో కంచెలు ఏర్పాటు చేసుకుని స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీశైలం మరిన్ని వివరాలు అందిస్తారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు