తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్తిక స్నానం చేస్తూ నదిలో మునిగిపోయిన మహిళ.. రక్షించిన స్థానికులు - మహిళను రక్షించిన స్థానికులు

Locals rescued a woman: పుష్కర ఘాట్ దగ్గర స్నానం చేయడానికి వచ్చిన ఓ మహిళ నీటిలో మునిగిపోతుండగా అక్కడున్న కొంతమంది వ్యక్తులు గమనించి, రక్షించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.

Locals rescued a woman
Locals rescued a woman

By

Published : Nov 6, 2022, 12:20 PM IST

Locals rescued a woman: నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్‌లోని పుష్కర్‌ ఘాట్‌ వద్ద స్నానం చేయడానికి వచ్చిన ఓ మహిళ నీటిలో మునిగిపోతుండగా అక్కడున్నవారు రక్షించారు. నిర్మల్‌ జిల్లాకు చెందిన దంపతులిద్దరూ కార్తీక మాసం సందర్భంగా గోదావరి నదికి వచ్చారు. వారు గంగ స్నానం చేస్తుండగా, ఆ మహిళ నీటిలో మునిగిపోవడాన్ని ఆర్మూర్‌కి చెందిన కొంతమంది వ్యక్తులు గమనించారు. వెంటనే ఆమెను సురక్షితంగా రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చి నీటిని కక్కించారు. కాసేపటికి ఆ మహిళ స్పృహలోకి వచ్చి కోలుకుంది.

నీటిలో మునిగిపోతున్న మహిళను రక్షించిన స్థానికులు..

ABOUT THE AUTHOR

...view details