మున్సిపల్ అధికారులు చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లోని మాంసం మార్కెట్ స్థలంలో కట్టడాలను నిలిపి వేయాలంటూ ధర్నాకు దిగారు. తమ వారసుల నుంచి సంక్రమించిన ఆస్తులను పురపాలక అధికారులు కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు.
అక్రమ కట్టడాలు నిలిపేయాలని స్థానికుల ఆందోళన - నిజామాబాద్ వార్తలు
అధికారులు తమ స్థలాలను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్‌లోని మాంసం మార్కెట్ స్థలాన్ని మున్సిపల్ అధికారులు ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
నిజామాబాద్‌లో స్థలాలు కబ్జా చేశారని స్థానికుల ఆందోళన
బోధన్ రోడ్డులోని మార్కెట్ స్థలంపై కోర్టు స్టే ఇచ్చినా కూడా పనులు ఆపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని తమ మార్కెట్ స్థలాన్ని తమకు కేటాయించాలని బాధితులు కోరుతున్నారు.