రాష్ట్రంలో 9 ఉమ్మడి జిల్లాలో 12 స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక..... ఏకగ్రీవం కానుంది. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. శ్రీనివాస్‌కు తాము మద్దతివ్వలేదని ఎంపీటీసీ నవనీత, కార్పొరేటర్ రజియా సుల్తానా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇది దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. కవిత ఏకగ్రీవంగా ఎన్నికకానుండటంతో నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా నివాసంలో సంబురాలు చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యే గణేష్ గుప్తా మిఠాయి తినిపించారు.
రంగారెడ్డిలోనూ ఏకగ్రీవమే...
రంగారెడ్డి జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి చలిక చంద్రశేఖర్ నామినేషన్ తిరస్కరించారు. ప్రతిపాదిత వ్యక్తుల సంతకాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. పోటీలో తెరాస అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి సుంకరి రాజు మాత్రమే మిగలడంతో... వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈనెల 26న ఎన్నికల అధికారులు ఈ మేరకు అధికారికంగా ప్రకటించనున్నారు.
మిగిలిన చోట్ల పోలింగ్..