నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామ సమీపంలోని గుట్టల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. కొందరు గ్రామస్థులకు చిరుత కనిపించిందని... స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ ఇంద్రకరణ్ సామాజిక మాధ్యమాల ద్వారా సందేశం పంపించారు.
గుట్టల్లో చిరుత కలకలం... సామాజిక మాధ్యమాల ద్వారా అప్రమత్తం - telangana news
నిజామాబాద్ జిల్లాలోని పోచారం గుట్టల్లో చిరుత సంచారం కలకలం సృష్టించింది. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ ఇంద్ర కరణ్ సామాజిక మాధ్యమాల ద్వారా సందేశం పంపించారు.
గుట్టల్లో చిరుత కలకలం... సామాజిక మాధ్యమాల ద్వారా అప్రమత్తం
చిరుత సంచారంపై పోలీసులతో ఆయన మాట్లాడినట్లు వెల్లడించారు. ప్రజలు పోచారం గ్రామానికి రావడానికి బషీర్ ఫారం నుంచి కాకుండా దూపల్లి గేటు నుంచి రావాలని సూచించారు.