విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాలను విడుదల చేయాలంటూ నిజామాబాద్ నగరంలోని ఎన్ఆర్ భవన్లో వామపక్ష సంఘాలు నిరసన దీక్ష నిర్వహించాయి. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో సాయిబాబా, వరవర రావులను అరెస్టు చేయడం దారుణమని వామపక్ష నాయకులు భూమన్న మండిపడ్డారు.
వరవరరావును విడుదల చేయాలంటూ వామపక్షాల దీక్ష - వరవరరావుకు బెయిల్ ఇవ్వమంటూ నిజామాబాద్‌లో వామపక్షనేతల నిరసన
విరసం నేత వరవరరావు, దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్‌లో వామపక్ష సంఘాల నిరసన చేశాయి. వారి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయాలని వామపక్షనేత భూమన్న కోరారు.
వరవరరావు , సాయిబాబాలను విడుదల చేయాలంటూ నిరసన దీక్ష
ప్రస్తుతం వారు అనారోగ్యంతో బాధపడుతున్నారని వారిపై కేసులు ఉంటే కోర్టులో హాజరుపరచాలే కానీ జైల్లో నిర్బంధించి వారి గొంతుకను నొక్కేయడం సరికాదని ఆరోపించారు. తక్షణమే వారికి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి కోరారు.