నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు వామపక్షాలు ఆందోళనకు దిగాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ కొరకు చార్జీలను నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ, సీపీయూఎస్ఐ, ఎంసీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పాలకవర్గం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, బీపీఎల్ దిగువన ఉన్న వారందరికీ ఇంటి పన్ను, నల్ల బిల్లు మాఫీ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇంటి పన్ను, నల్ల బిల్లు మాఫీ చేయాలని వామపక్షాల ధర్నా - nizamabad corporation latest news
యూజీడీ కనెక్షన్ చార్జీలు రద్దు చేయాలని, ఇంటి పన్ను, నల్ల బిల్లు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు వామపక్షాలు ధర్నా చేశాయి. మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశాయి.
ఇంటి పన్ను, నల్ల బిల్లు మాఫీ చేయాలని వామపక్షాల ధర్నా
నిజామాబాద్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కొరకు దశాబ్ద కాలంగా వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు అన్నారు. పైప్ లైన్ వేసినప్పటికీ కనెక్షన్ ఇవ్వటంలో నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు అలాగే ఉండిపోయిందని విమర్శించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి:-పునాది రాయితో పులకించిన అయోధ్య