నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో.. హాథ్రస్ ఘటనకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. హాథ్రస్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు.
హాథ్రస్ ఘటనకు వ్యతిరేకంగా బోధన్‌లో వామపక్షాల నిరసన - left parties protest in nizamabad
యూపీ హాథ్రస్ ఘటనకు నిరసనగా మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. హాథ్రస్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
హాథ్రస్ ఘటనకు వ్యతిరేకంగా బోధన్‌లో వామపక్షాల నిరసన
యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు, ఎస్సీ,ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.