రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పీఆర్సీని 63శాతం ప్రకటించాలని పీఆర్టీయూ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పీఆర్సీ నివేదికను వ్యతిరేకిస్తూ పీఆర్టీయూ నిరసన - Nizamabad District Latest News
ప్రభుత్వం చొరవ తీసుకుని పీఆర్సీని 63శాతం ప్రకటించాలని పీఆర్టీయూ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు శంకర్ డిమాండ్ చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద నేతలతో కలిసి నిరసన తెలిపారు.

పీఆర్సీకి వ్యతిరేకంగా పీఆర్టీయూ నిరసన
వేతన సవరణ నివేదికపై పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నేతలు నిరసన తెలుపుతూ పీఆర్సీ పత్రాలు దహనం చేశారు. మూడేళ్లు కష్టపడి పీఆర్సీ కమిటీ.. జీతాలు పెంచకపోగా తగ్గించేలా ప్రతిపాదనలు చేయడం దారుణమన్నారు.