తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్మూర్​లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు - నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

నిజామాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రజాప్రతినిధులు ఆర్మూర్​లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. స్క్రీనింగ్ పరీక్షల అనంతరం ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అనుమతి ఇచ్చారు.

leaders cast their votes at armoor in nizamabad district
ఆర్మూర్​లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు

By

Published : Oct 9, 2020, 5:20 PM IST

నిజామాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 36 మంది కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ ఓటు వేశారు.

స్క్రీనింగ్ పరీక్షల అనంతరం...

ప్రజాప్రతినిధులను పోలింగ్ కేంద్రానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీసుకువచ్చారు. స్క్రీనింగ్ పరీక్షల అనంతరం ఎన్నికల సిబ్బంది ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటు వేసిన మంత్రి వేముల

ABOUT THE AUTHOR

...view details