తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్ జిల్లాలో కొనసాగిన అరెస్టుల పర్వం - బంద్​ ఎఫెక్ట్​: నిజమాబాద్ జిల్లాలో కొనసాగిన అరెస్టుల పర్వం...

ఆర్టీసీ జేఏసీ బంద్​ సందర్భంగా నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగింది. జిల్లాలో సుమారు 500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

LEADERS ARRESTED IN TSRTC BANDH AT NIZAMABAD

By

Published : Oct 19, 2019, 8:11 PM IST

నిజామాబాద్ జిల్లాలో బంద్​ సందర్భంగా అరెస్టుల పర్వం కొనసాగింది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట ధర్నా చేస్తున్న భాజపా, కాంగ్రెస్, తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ ఎదుట పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను పోలీస్​స్టేషన్లకు తరలించారు. ర్యాలీగా వచ్చిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి ఒంటి గంట వరకు సుమారు 500 మందిని అరెస్టు చేసిన పోలీసులు... వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంతేకాకుండా కొందరు వామపక్ష నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 39 బస్సులను పోలీసుల బందోబస్తుతో మధ్యాహ్నం వరకు నడిపించారు. అనంతరం పూర్తిగా నిలిపివేశారు.

బంద్​ ఎఫెక్ట్​: నిజమాబాద్ జిల్లాలో కొనసాగిన అరెస్టుల పర్వం...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details