ఎగువ నుంచి ప్రాంతం నీటి ప్రవాహం లేక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వెలవెలబోతోంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయని అయిన ఈ ప్రాజెక్టుకు గోదావరి ప్రవాహమే ఏకైక మార్గం. మండుతున్న ఎండలతో నదిలో నీళ్లు లేక జలసవ్వడి కనిపించడం లేదు. కందకుర్తి వద్ద హరిద్రా, మంజీరా, గోదావరి నదులు కలిసే త్రివేణి సంగమం ఎడారిని తలపిస్తోంది.
నీళ్లు లేక వెలవెలబోతోన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు - నీళ్లు లేక వట్టిపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
వేసవి తీవ్రత పెరుగుతోంది.. నదులు, బావులు, కుంటల్లో నీరు ఇంకిపోతోంది.. భూగర్భ జలమట్టం పడిపోతోంది. నిజామాబాద్ జిల్లాలో గోదావరి నది పూర్తిగా ఎండిపోయి వేసవి తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లాలో నీళ్లు లేక వట్టిపోతున్న వైనంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు.
నీళ్లు లేక వెలవెలబోతోన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు