Technology for Impact and Scale: దేశంలోనే విజయవంతమైన స్టార్టప్‌గా తెలంగాణ నిలిచిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో కాకతీయ సాండ్ బాక్స్ డెవలప్‌మెంట్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్ అనే అంశంపై మాట్లాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్టు నాలుగేళ్లలో నిర్మించామని.. లక్ష కిలో మీటర్ల పైప్‌లైన్ వేసి కోటి ఇళ్లకు మంచి నీరు అందిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు ఐటీ పరిశ్రమ విస్తరించామని పేర్కొన్నారు.
KTR Nizamabad Tour: పర్యటనలో భాగంగా రైతులతో మాట్లాడిన కేటీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయంలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై అవగాహన లేనివారు అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుపక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలతో తెలంగాణలో ఐదు రకాల విప్లవాలు వచ్చాయని తెలిపారు. సాగుకు సాంకేతికతను జోడించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. ఇందుకు రైతులు కూడా కలిసిరావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.