తెలంగాణ

telangana

ETV Bharat / state

సరైన నాయకుడిని ఎన్నుకోండి: కోదండరాం - telangana municipal Elections

డబ్బులు పంచి గెలిచిన నాయకులు.. ఆ డబ్బులు తిరిగి సంపాదించడం కోసం తప్ప.. ప్రజల కోసం పని చేయరని అన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. నిజామాబాద్​ కార్పొరేషన్​లో ప్రచారం నిర్వహించారు.

kodandaram campaign in nizamabad district
సరైన నాయకుడిని ఎన్నుకోండి: కోదండరాం

By

Published : Jan 19, 2020, 4:37 PM IST

నిజామాబాద్​లో తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున పలు డివిజన్లలో ప్రచారం చేశారు. డబ్బులు పంచి గెలిచిన నాయకులు.. ఆ డబ్బులు తిరిగి సంపాదించడం కోసం తప్ప... ప్రజల కోసం పని చేయరని చెప్పారు.

నాయకులైతే చాలు ఆస్తులు అమాంతం పెరిగిపోతున్నాయని ఆరోపించారు. సంపాదన కాకుండా ప్రజా సంక్షేమం కోసం పని చేసే నాయకులు కావాలని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా తెలంగాణ జనసమితి ముందుకొచ్చందని.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.

సరైన నాయకుడిని ఎన్నుకోండి: కోదండరాం

ఇవీ చూడండి: వికారాబాద్​లో మైనర్​బాలికపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details