నిజామాబాద్ పసుపు మార్కెట్‌ను కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డి సందర్శించారు. ఇటీవల పసుపు పంటకు ధర పెరిగిన నేపథ్యంలో మార్కెట్లోని పసుపును పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వ్యాపారులు కోట్ చేస్తున్న ధరలు, పంటకైన పెట్టుబడుల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్ పసుపు మార్కెట్లో అన్వేశ్ రెడ్డి - kisan congress state president anvesh reddy
రైతులందరికి కనీస ధర లభించినప్పుడే న్యాయం జరుగుతుందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పసుపు మార్కెట్‌ను సందర్శించి.. రైతులతో మాట్లాడారు.
నిజామాబాద్ పసుపు మార్కెట్లో అన్వేశ్ రెడ్డి
కేవలం ఒకరిద్దరికి మాత్రమే రూ.10 వేలు, రూ.9వేలు అంటూ ధర పెడుతున్న వ్యాపారులు.. మిగతా వారికి మాత్రం రూ.6వేల లోపే చెల్లిస్తున్నారని రైతులు వాపోయారు. పంట విస్తీర్ణం, దిగుబడి తగ్గడం వల్ల ధర పెరిగితే.. కొన్ని పార్టీలు తామే ధర పెరిగేందుకు కారణమన్నట్లు పాలాభిషేకాలు చేయించుకోవడం విడ్డూరమన్నారు. రైతులందరికి కనీస ధర లభించినప్పుడే న్యాయం జరుగుతుందని అన్వేష్ రెడ్డి తెలిపారు.