Kinnera mogulaiah in Nizamabad: నిజామాబాద్ పట్టణంలో సంగీత్ కల్చరల్ అకాడమీ 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తనకు పద్మశ్రీ అవార్డు తెచ్చిపెట్టిన కిన్నెర వాయిద్యాన్ని ప్రేక్షకుల ముందు ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతే తమలాంటి కళాకారులు ప్రపంచానికి పరిచయమయ్యారని కిన్నెర మోగులయ్య ఆనందం వ్యక్తం చేశారు.
నిజామాబాద్లో కిన్నెర మొగులయ్య సందడి
Kinnera mogulaiah in Nizamabad: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్య సందడి చేశారు. కిన్నెర వాయిద్యాన్ని ప్రేక్షకుల ముందు వాయించారు. తెలంగాణ పల్లెల్లో దాగి ఉన్న ఆట, పాటలను, కళలను, కళాకారులను బతికించాలన్నారు.
mogulaiah
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామానికి చెందిన కిన్నెర మొగలియ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ వృత్తిని కొనసాగిస్తూనే తనలో దాగి ఉన్న కలలను మర్చిపోకుండా సాధన చేస్తే విజయం సాధిస్తామన్నారు.
ఇవీ చదవండి: