నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి కవిత భారీ మెజారిటీతో గెలవడంతో సంబురాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, సాలుర గ్రామం, నవిపేట్ మండల కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలు టపాకాయలు పేల్చి సంబురాలు చేసుకున్నారు.
కవిత ఘన విజయం... తెరాస సంబురాలు - కవిత విజయంపై తెరాస శ్రేణుల సంబురాలు
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం సాధించగా... తెరాస నాయకులు, కార్యకర్తలు జిల్లాలోని పలు మండలాల్లో సంబురాలు చేసుకున్నారు. టపాకాయలు పేల్చి కవితకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మంత్రి పదవి చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
కవిత ఘన విజయం... పలు మండలాల్లో తెరాస సంబురాలు
బోధన్ మండలం సాలురలో ఎంపీపీ బుద్దె సావిత్రి, పలువురు నాయకులతో కలిసి టపాకాయలు పేల్చి కవితకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మంత్రి పదవి చేపట్టాలని ఎంపీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:కవిత జయభేరీ.. ఆనందంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి డ్యాన్స్