తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు తెరాస అభ్యర్థి కవిత. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తెరాస అభ్యర్థిగా కవిత ఘనవిజయం సాధించారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారీ ఆధిక్యంతో గెలుపొందారు.
తెరాస 728, భాజపా 56, కాంగ్రెస్ 29, చెల్లని ఓట్లు 10 నమోదయ్యాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్న కవిత... అందరూ సమన్వయంతో పనిచేసి విజయాన్ని అందించారని పేర్కొన్నారు.