కొంతమంది రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని తెరాస ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. కుమార్తె కంటే రైతుల గురించే కేసీఆర్ ఎక్కువగా ఆలోచిస్తారని అన్నారు. గతేడాది ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకుందని చెప్పారు.వేముల ప్రశాంత్ రెడ్డి సన్మాన సభకు కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రిగాఉత్తమ పనితీరు కనబర్చి ప్రజలకు సేవ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాకంటే మీపైనే ప్రేమ ఎక్కువ - PRASHANTH REDDY
పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనపై ఎంపీ కవిత స్పందించారు. కొంతమంది కావాలనే రెచ్చగొట్టి నిరసనలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

ప్రశాంత్ రెడ్డి సన్మాన సభలో కవిత
ప్రశాంత్ రెడ్డి సన్మాన సభలో కవిత
Last Updated : Feb 28, 2019, 1:06 AM IST