తెలంగాణ

telangana

ETV Bharat / state

శాసనమండలి సభ్యులుగా కవిత, దామోదర్‌రెడ్డి ప్రమాణం స్వీకారం - Kavitha, Damodar reddy Oath in as members of the ts Legislature

Kavitha, Damodar reddy Oath
శాసనమండలి సభ్యులుగా కవిత, దామోదర్‌రెడ్డి ప్రమాణం

By

Published : Jan 19, 2022, 2:22 PM IST

Updated : Jan 19, 2022, 2:54 PM IST

14:15 January 19

శాసనమండలి సభ్యులుగా కవిత, దామోదర్‌రెడ్డి ప్రమాణం స్వీకారం

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, దామోదర్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ జాఫ్రీ ఇద్దరు ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కవిత.. మహబూబ్ నగర్ నుంచి దామోదర్ రెడ్డి ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్​కు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కవిత ధన్యవాదాలు తెలిపారు.

Last Updated : Jan 19, 2022, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details