తెలంగాణ

telangana

కవిత భవిష్యత్తుపై నేతలేమంటున్నారంటే...

By

Published : Oct 13, 2020, 5:21 AM IST

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత గెలుపు తర్వాత... ఆమె మంత్రివర్గంలో చేరడంపై ప్రచారం జోరందుకుంది. జిల్లా మంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. పైగా ఇందు కోసమే ఎమ్మెల్సీగా పోటీ చేశారన్న చర్చ కూడా సాగుతోంది. దసరా నాటికి ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టతనిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

కవిత భవిష్యత్తుపై నేతలేమంటున్నారంటే...
కవిత భవిష్యత్తుపై నేతలేమంటున్నారంటే...

కవిత భవిష్యత్తుపై నేతలేమంటున్నారంటే...

గత పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత... కవిత రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ఆమె మంత్రి పదవిని చేపట్టడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. ఐతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైన నాటి నుంచే కవిత మంత్రి కావడం ఖాయమన్న ప్రచారం మొదలైంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా విజయంతో ఇక మంత్రి పదవిని చేపట్టడమే తరువాయి అన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పోలింగ్, లెక్కింపు సందర్భంగా జిల్లా మంత్రితో పాటు ఎమ్మెల్యేల వ్యాఖ్యలు సైతం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కవితకు ముఖ్యమంత్రి ఏ పదవి ఇచ్చినా సంపూర్ణ మద్దతు ఉంటుందని.. జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఉన్నత పదవి అని ఒకరు... కాబోయే ముఖ్యమంత్రి అని మరొకరు

బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఏకంగా కవిత సమక్షంలోనే కాబోయే మంత్రి అంటూ సంబోధించారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కవిత బోధన్‌కు వచ్చిన సమయంలో ఎమ్మెల్యే షకీల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కవిత అక్కడి నుంచి వెళ్లిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ... కవిత మంత్రి కావడం ఖాయమని స్పష్టంగా చెప్పారు. రాబోయే రోజుల్లో కవిత ఉన్నత పదవిని అధిష్ఠిస్తారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో పిచ్చాపాటిగా మట్లాడుతూ చెప్పారు.

మంత్రి పదవి దక్కేనా..?

కవిత ఎమ్మల్సీగా గెలడంతో ఈనెల 14న నిర్వహించనున్న సమావేశాల్లో మండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం దసరా కానుకగా సీఎం కేసీఆర్‌ మంత్రివర్గంలోకి కవితను తీసుకుంటారని భావిస్తున్నారు. కవిత మంత్రి పదవి చేపట్టే పక్షంలో క్యాబినెట్ ఒకరు పదవి త్యాగం చేయాల్సి ఉంటుంది. అది ఎవరనే చర్చ తీవ్రంగా సాగుతోంది.

ఇదీ చూడండి:భారీ మెజార్టీతో కవిత గెలుపు... విపక్షాల డిపాజిట్లు గల్లంతు...

ABOUT THE AUTHOR

...view details