కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని శివాలయాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. కార్తిక సోమవారం రోజు పౌర్ణమి కూడా రావడంతో భక్తులు విశేషంగా భావిస్తున్నారు. నిజామాబాద్ కేంద్రంలోని కంఠేశ్వర ఆలయంలో మహిళలు, యువతులు కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. అనంతరం పరమేశ్వరుని దర్శించుకున్నారు.
కంఠేశ్వర ఆలయంలో దీపాల వెలుగులతో కార్తిక శోభ - కార్తిక పూజలు
కార్తిక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో కార్తిక శోభ సంతరించుకుంది. సోమవారం, పౌర్ణమి ఒకే రోజు రావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర ఆలయంలో భక్తులు దీపారాధనలు, ప్రత్యేక పూజలు చేశారు.
కంఠేశ్వర ఆలయంలో దీపాల వెలుగులతో కార్తిక శోభ