తెలంగాణ

telangana

ETV Bharat / state

'డ్యూటీ ముగించుకుని వెళ్లాలంటే భయమేస్తోంది' - నిజామాబాద్ జూనియర్ డాక్టర్లు ధర్నా

మౌలిక వసతులున్న హాస్టళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ..నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రి ఎదుట జూనియర్ డాక్టర్లు ధర్నా చేపట్టారు. రాత్రివేళ డ్యూటీ ముగించుకుని వెళ్లాలంటే భయమేస్తోందని మహిళా వైద్యులు వాపోతున్నారు.

junior doctors protest

By

Published : Dec 29, 2020, 8:19 PM IST

హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రి ఎదుట జూనియర్ డాక్టర్లు ధర్నా చేపట్టారు. అక్కడ తమకు భద్రత లేదని, రాత్రివేళ డ్యూటీ ముగించుకుని వెళ్లాలంటే భయమేస్తోందని మహిళా వైద్యులు వాపోతున్నారు.

ఈ విషయంపై ప్రిన్సిపల్ కు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అందుకే నిరసన చేపట్టవలసి వచ్చిందని పేర్కొన్నారు. శాశ్వత హాస్టల్ సౌకర్యం కల్పించేవరకు ఇది కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు.

ఇది చదవండి: ఐక్యతతోనే బీసీల ఎదుగుదల సాధ్యం: సారయ్య

ABOUT THE AUTHOR

...view details